నిమ్మకాయ తొక్క అంటే మనం సాధారణంగా ఉపయోగించకుండానే పారేసే భాగం. కానీ నిమ్మకాయ తొక్కలో ఉండే పోషకాల శాతం నిమ్మరసానికి మించినది అన్నది శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇందులో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, పెక్టిన్ వంటి ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలు ఉన్నాయి. నిమ్మ తొక్కలో విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలో వచ్చే వైరస్, బాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. నిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారుగా మారుస్తాయి. మెలానిన్ ఉత్పత్తిని నియంత్రించి మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మ తొక్క పొడి + తేనె + పాలు కలిపి ఫేస్ ప్యాక్ వంటివిగా వాడొచ్చు. నిమ్మకాయ తొక్క పేస్ట్‌ను తలకు రాస్తే తల దద్దుర్లు, ఉబ్బెత్తులు, జువ్వలు తగ్గుతాయి. తల చర్మంలో బాక్టీరియాలను నాశనం చేస్తుంది.

కొబ్బరి నూనెలో నిమ్మ తొక్క పొడి వేసి రాసినట్లయితే జుట్టు నిగనిగలాడుతుంది. నిమ్మ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్, యాంటీబాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను నివారిస్తాయి. పళ్ల మీద ఉన్న పసుపు, మచ్చలు తగ్గతాయి. నిమ్మ తొక్క పొడి + ఉప్పు లేదా బెయికింగ్ సోడాతో పళ్లను రుద్దితే మంచిది. నిమ్మ తొక్కలో ఉండే పెక్టిన్ ఫైబర్ పేగులకు ఎంతో మేలు చేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. నిమ్మ తొక్క నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. నిమ్మ తొక్కలోని ఫైబర్ మరియు ఫ్లావనాయిడ్లు కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. శరీరంలోని బాడీ ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడే పొలిఫెనాల్స్ ఇందులో ఉంటాయి.

నిమ్మ తొక్కలో ఉండే పొటాషియం, పెక్టిన్ మరియు ఫ్లావనాయిడ్లు రక్తనాళాల్ని శుభ్రపరుస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నిమ్మ తొక్కలో లిమోనిన్, డి-లిమోనిన్ అనే పదార్థాలు ఉండటంతో అవి క్యాన్సర్ కారక కణాల పెరుగుదల్ని నిరోధిస్తాయి. ఈ పదార్థాలు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వంటి వాటిపై ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసి దుస్తులలో, ఫ్రిడ్జ్‌లో లేదా టాయిలెట్ ప్రాంతాల్లో ఉంచితే వాసన తొలగిపోతుంది. గోరువెచ్చని నీటిలో వేసి గార్గిల్ చేస్తే నోటి దుర్వాసన పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: