ఆవలింతలు రావడం అనేది సాధారణంగా అలసట లేదా నిద్రలేమి వల్ల వచ్చే  అవకాశం ఉంది.   కొన్నిసార్లు ఇది అంతర్లీన వైద్య సమస్యలకు సంకేతం  అవుతుంది.  ఆవలింతలు తరచుగా వస్తుంటే లేదా ఇతర లక్షణాలతో పాటు ఉంటే, వైద్యుడిని సంప్రదించడం  మంచిదని చెప్పవచ్చు. తరచుగా ఆవలింతలు రావడం అలసటకు సంకేతం కాగా ఇది శారీరక లేదా మానసిక అలసట వల్ల కావచ్చు.

ఆవలింతలు నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలకు సంకేతంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు, గుండె జబ్బులు, మెదడు కణితులు, లేదా నరాల సంబంధిత వ్యాధులు వంటి ఇతర వైద్య సమస్యల వల్ల కూడా ఆవలింతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.  మీరు తరచుగా ఆవలింతలతో ఇబ్బంది పడుతుంటే. తలనొప్పి, మైకం, లేదా దృష్టి లోపం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

మీరు ఆందోళన లేదా ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే తరచుగా ఆవలింతలు   వచ్చే అవకాశం ఉంటుంది. మీకు గుండె జబ్బులు లేదా ఇతర వైద్య సమస్యలు ఉంటే కూడా కొన్ని సందర్భాల్లో ఆవలింతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.  మధ్యాహ్నం సమయంలో  తరచుగా నిద్ర వస్తుంటే మాత్రం  జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  మెదడుకు తగినంత  ఆక్సిజన్ చేరకపోయినా ఆవలింతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఆవలింతల ద్వారా మెదడు శరీరంలో ఉష్ణోగ్రత,  ఆక్సిజన్ ను  నియంత్రిస్తుంది చెప్పవచ్చు.  వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువ సమయం కూర్చుంటే కూడా ఆవలింతలు వస్తాయి.  లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.  వెంటిలేషన్ ఉన్న  ప్రదేశంలో ఉండటం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: