
పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి శాంతి కలుగుతుంది. ఇందులో ఉండే మాంగనీస్ అనే ఖనిజం మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల పైనాపిల్ జ్యూస్ ఆకలి తగ్గించడంలో సహాయపడుతుంది. కొవ్వు కరిగే ప్రక్రియకు సహకరిస్తుంది. విటమిన్ C వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి చర్మం నయం చేస్తాయి. మొటిమలు, ముడతల నివారణలో సహాయపడుతుంది.పైనాపిల్‌లో మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. పాత వయస్సులో ఎముకల బలహీనత, ఆర్థరైటిస్‌కు ఇది ఒక పరిష్కారంగా ఉంటుంది. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పైనాపిల్‌లోని యాసిడ్‌లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి మూత్రనాళ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పైనాపిల్‌లో ఉన్నాయి. పిల్లల ఎదుగుదలకు, జీర్ణశక్తికి, శక్తికి ఇది సహాయపడుతుంది. పైనాపిల్‌లో యాసిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపులో తాగితే అసిడిటీ, గ్యాస్, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. పైనాపిల్‌లో సహజంగా చక్కెర ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అలాగే చక్కెర కలిపి తాగకూడదు. పైనాపిల్ తిన్న తర్వాత నోరు తియ్యగా ఉండటం, జివ్వులు రావడం, ఛాతిలో మంట వంటి లక్షణాలు ఉంటే తక్కువ చేయాలి లేదా పూర్తిగా మానాలి.