మన ఇండియా లో అత్యంత అభివృద్ధి చెందిన పట్టణాల్లో  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాలు ఉంటాయి.. ఇందులో ముఖ్యంగా బెంగళూరు లో చాలా వరకు అభివృద్ధి ఉంటుంది. బెంగళూరు కు వలస వెళ్లి బ్రతకాలి అంటే తప్పని సరిగా ఆలోచన చేయాల్సిందే. ముఖ్యంగా అక్కడ ఉద్యోగాలు చేసే వారికి  జీతాల కంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తుందట.. వాళ్లు చేసిందంతా అద్దె రూపం లోనే కట్టాల్సి వస్తోందని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అయితే తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.


బెంగళూరు లో ఒక ఇంటి యజమాని అద్దె ఇల్లు ఇవ్వడం కోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద 23 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని అన్నారట.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.. 4BHK ఇంటి కి  23 లక్షల డిపాజిట్ తో పాటుగా నెలకు రూ: 2.3 లక్షల అద్దె చెల్లించాలని ఒక వ్యక్తి రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన చాలా మంది అవాక్కైపోతున్నారు.. అసలు బెంగళూరు మన ఇండియా లోనే ఉందా.. లేదంటే అమెరికా లో ఉందా..అంటూ మాట్లాడుతున్నారు.

 న్యూయార్కు, సింగపూర్, దుబాయ్, లండన్ లాంటి దేశాల్లో కూడా ఇంత ఇంటి అద్దె లేదని కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనప్పటికీ అద్దె ఇచ్చే యజమానులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన వారు ఎలా బ్రతకాలి అంటూ మాట్లాడుకుంటున్నారు. 23 లక్షలు చెల్లిస్తే బెంగళూరు దగ్గరి ప్రాంతాల్లో ఏకంగా ఇల్లే వస్తుందని మాట్లాడుకుంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ అద్దె ఇంటి కి 23 లక్షల డిపాజిట్ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: