బాలీవుడ్ హాట్ కపుల్ రణవీర్ సింగ్.. దీపికా పదుకునే అప్ కంపింగ్ మూవీ భాజీరావ్ మస్తానీ. ఆ సినిమాలో ఓ హాట్ సీన్ కోసం దాదాపు 12 గంటల సమయం తీసుకున్నారట. బాలీవుడ్ బాహుబలి సినిమాగా రాబోతున్న భాజీరావ్ మస్తానీ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ నుండి భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇందులో రణవీర్ వైఫ్ గా ప్రియాంకా చోప్రా చేస్తుండగా రహస్య ప్రియురాలిగా దీపికా పదుకునే చేస్తుండటం విశేషం. రామ్ లీలా డైరెక్ట్ చేసిన సంజయ్ లీలా భన్సాలీనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా రణవీర్ దీపిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి  అందరికి తెలిసిందే.


మీడియా ముందు కూడా వీరు చాలా సార్లు కంటపడ్డారు .. రామ్ లీలాకు ముందు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన రణవీర్ ఆ సినిమా నుండి దీపికానే పట్టుకున్నాడు. దీపికా కూడా రణవీర్ తో సన్నిహితంగా ఉంటుంది. రామ్ లీలా సినిమా నుండి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందని అందరికీ తెలిసినా బయట పడట్లేదు. లీలా సినిమాలో కూడా హాట్ హాట్ సీన్లలో నటించి ఆడియెన్స్ ని అలరించిన ఈ ఇద్దరు.. ప్రస్తుతం నటిస్తున్న భాజీరావ్ మస్తానీలో మరోసారి రెచ్చిపోయి ఇంటిమేట్ సీన్లలో నటించారని టాక్.


రామ్ లీలా సినిమాలో రణవీర్ దీపికా : 


ఆ సీన్లు దాదాపు 12 గంటల పాటు షూట్ చేశారట చిత్ర యూనిట్. అన్ని గంటలు దీపికాను తన ముద్దులతో ముంచెత్తాడట.. అంతేకాదు సినిమాలో ఈ సీన్లు మాత్రం హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తుంది. ఇక సినిమాలో మరో హీరోయిన్ ప్రియాంకతో కూడా హాట్ సీన్లు ఉన్నాయట. ఎస్.ఎల్.బి ప్రొడక్షన్లో సంజయ్ లీలా భన్సాలీ, కిశోర్ లుల్లా నిర్మిస్తున్న బాజిరావ్ మస్తానీ సినిమా దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. 


సెకండ్ మరాట చక్రవర్తి బాజిరావ్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైన నాటి నుండి ఎన్నో సంచలనాలకు దారితీసింది. బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా అన్ని హంగులు ముగించుకుని డిశెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: