అందాల ముద్దు గుమ్మ తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమాలోనే అందచందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దు గుమ్మ తెలుగు నాట క్రేజీ సినిమా ఆఫర్ కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఆ తర్వాత కాలంలో కూడా తమన్నా సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. తమన్నా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లాంటి భాషల సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

ఇది మాత్రమే కాకుండా తాజాగా కొన్ని రోజుల క్రితం నుండి తెలుగులో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ అనే షో కు కూడా తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది. తమన్నా ఫస్ట్ టైం ఒక షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షో కు మొదట మంచి ప్రజాదరణ దక్కింది. కాగా ఆ తర్వాత మాత్రం ఈ షోకు పెద్దగా ప్రజాదరణ దక్కకపోవడంతో తమన్నాకు  ఇచ్చే రెమ్యూనరేషన్ మరియు ఇతర ఖర్చులు అన్నీ కలిపి చూసుకుంటే రాబడి కంటే ఖర్చే ఎక్కువ కావడంతో తమన్నా ను తప్పించి బుల్లి తెరలో ఫుల్ క్రేజ్ వున్నా అనసూయ మాస్టర్ చెఫ్ నిర్వాహక బృందం  హోస్ట్ గా తీసుకోబోతున్నారు అని అనేక వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చినట్టుగానే ఏ కారణాల వల్లో తెలియదు కానీ తమన్నా ను తప్పించి మాస్టర్ చెప్ నిర్వాహక బృందం అనసూయ ను రంగంలోకి దించారు. బుల్లి తెరలో ఫుల్ క్రేజ్ వున్న అనసూయ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షో జనాలను ఎంతగానో అలరిస్తుంది అని మాస్టర్ చెఫ్ నిర్వాహక బృందం భావించినట్లు తెలుస్తోంది. అనసూయ ను రంగంలోకి దించిన  అప్పటికి కూడా మాస్టర్ చెఫ్ షో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కావడం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: