జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగానే కాదు, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సాలిడ్ సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తారక్ సెట్ లో ఎలా ఉంటారు, తోటి నటులు మరియు ఆర్టిస్ట్ లతో ఎలా వుంటారు అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇదే విషయంపై మాట్లాడుతూ యంగ్ టైగర్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చాడు సినిమాల్లో కో-డ్యాన్సర్. ఎన్టీఆర్ చేసిన పలు చిత్రాల్లో ఎన్నో పాటల్లో అదిరిపోయే స్టెప్పులు వేసి అదరహో అనిపించారు. 

తారక్ డ్యాన్స్ స్పీడ్ తెలిసిందే. గాలివేగం తో స్టెప్పులు వేసేస్తారు, ఎలాంటి స్టెప్ అయినా చేసి చూపిస్తాడు, ఎంత కష్టమైన మూమెంట్ అయినా సింగిల్ టేక్ లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు వెనుక తారక్ తో పాటు కలిసి స్టెప్పులు వేయాల్సిన డ్యాన్స్ లు వేయాల్సిన డ్యాన్సర్ లు ఇంకెంత స్పీడ్ గా జాగ్రత్తగా ఉండాలి. కాగా ఇదే అంశం గురించి చెప్పుకొచ్చాడు ఆ డ్యాన్సర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్టెప్పులు వేయడమంటే సామాన్యమైన విషయం కాదు తేడా వస్తే స్టెప్పు బాగా రాకపోతే అన్న తంతాడు. అందుకే అన్నతో డ్యాన్స్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను, అన్నతో డ్యాన్స్ అంటే నాకు షివరింగ్ వస్తుంది అన్నాడు.

కానీ తారక్ అన్న సీరియస్ గా కొట్టరు, ఏదో సరదాగా చేస్తారు. రేయ్ నేనే అప్పుడప్పుడు స్టెప్స్ మిస్ చేస్తా ఇపుడు మీరు కూడా చేస్తే ఎన్ని టేక్ లు చెయ్యాలిరా అని సరదాగా ఆటపట్టిస్తారు. సెట్ లో తారక్ అన్న చాలా సరదాగా, అందరితోనూ కలివిడిగా ఉంటారు అని ఆ డ్యాన్సర్ చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్టీఆర్ డ్యాన్సర్ లతో ఎలా ఉంటాడు అనే విషయాన్ని తెలిపాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: