ఒకప్పుడు సినీ సెలబ్రిటీల ను కలవడం మాట్లాడటం అంటే అభిమానులకు  కేవలం కలలో మాటే. ఎప్పుడో ఒకసారి మాత్రమే దూరం నుంచి తమ అభిమాన హీరో హీరోయిన్లను చూసి మురిసిపోయేవారు అభిమానులు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు దూరంగా చూసి ఆనందపడే ప్రేక్షకులు ఇక ఇప్పుడు సెలబ్రిటీలతో నేరుగా మాట్లాడే అవకాశం సోషల్ మీడియా కారణంగా వస్తుంది.. అటు ఎంతోమంది సినిమా హీరో హీరోయిన్లు కూడా కాస్త సమయం దొరికిందంటే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.


 ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు అభిమానులతో తరచు చిట్ చాట్ చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా అభిమానులతో హీరోయిన్లు ముచ్చటిస్తూ సమయంలో కొన్ని కొన్ని సార్లు నెటిజన్లు అడిగే ప్రశ్నలు ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు నెటిజన్లు అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక మరికొన్ని సార్లు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అటు సినీ సెలబ్రిటీలు కూడా ఆసక్తికర సమాధానం చెబుతూ షాక్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలాంటి సమాధానం చెప్పి నెటిజన్లకు షాక్ ఇచ్చింది.


 బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతుంది సోనాక్షిసిన్హా.. తన అందం అభినయంతో కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.. ఇకపోతే ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఎంతో సెటైరికల్ సమాధానం చెప్పింది హీరోయిన్. ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వషన్ లో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంది సోనాక్షి సిన్హా. ఇంతలో ఒక నెటిజన్ మీ పెళ్లెప్పుడు మేడం.. అందరూ చేసుకుంటున్నారు అంటూ అడిగాడు. దీంతో ఈ అమ్మడికి ఎంత కోపం వచ్చిందో ఏమో  ప్రతి ఒక్కరికి కోవిడ్ వస్తుంది అంటే నాకు కూడా రావాలా అంటూ రిప్లై ఇచ్చింది సోనాక్షిసిన్హా. దీంతో నెటిజన్స్ షాక్ అయ్యారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: