
ఒక క్లీన్ ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతోందని అర్దం అవుతోంది. అదే విధంగా ట్రెయిలర్ లో హీరో చెప్పిన డైలాగ్ ‘తాగితే గాని మా బ్రతుకులకు ఏడుపురాదు… తాగినోడి ఏడుపుకేమో వాల్యూవే లేదు ’ అన్న డైలాగ్ కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. యూత్ అయితే సత్యం చెప్పావు బ్రో అంటూ కామెంట్లు పెడుతూ సందడి చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వక్ రికార్డ్ క్రియేట్ చేస్తారనే అంటున్నారు.
అయితే విశ్వక్ సేన్ ఎందుకో రూటు మార్చాడని క్లియర్ గా తెలుస్తోంది. మాములుగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో ఎంచక్కా లవ్ స్టోరీస్ తీసుకోకుండా ఎందుకో ఇలా పల్లెటూరి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథలపై దృష్టి పెట్టాడు. అయితే తనకు కథపై ఎంత నమ్మకం లేకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఈ సినిమాను విద్య సాగర్ డైరెక్ట్ చేశాడు. అయితే ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుని మార్కులు కొట్టేసింది. మరి సినిమా ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.