'జయం' సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్ ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా గణనీయంగా పోగేసుకున్నాడు.  యంగ్ హీరోలలో నితిన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా తమ క్రేజ్ రేంజ్ ను పెంచుకుంటూ పోయే అతి తక్కువ మంది హీరోలలో నితిన్ కూడా ఒకరని మరోసారి నిరూపించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం సినిమాల పరంగా నితిన్ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్నారనే చెప్పాలి. 'అ ఆ' వంటి కమర్షియల్ హిట్ తర్వాత వచ్చిన చల్ మోహనరంగా, లై వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ తరవాత భీష్మ సినిమా హిట్ అందుకుని మళ్ళీ నితిన్ కు ఊపిరి ఇచ్చింది. దాంతో మళ్ళీ హీరో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కేసాడు ఇక తగ్గేదే లే అని అంతా అనుకుంటుండగా మళ్ళీ  చక్ దే, మాస్ట్రో చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆయన ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.  ఇంతకు ముందు వచ్చిన చెక్, రంగ్ దే, మాస్ట్రో కూడా వరుసగా నిరాశపరచగా..ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన  మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా అదే బాట పట్టి నిరాశపరిచింది.  ఇలా వరుస ఫ్లాప్ లు పడ్డాయి, కానీ అవేవీ నితిన్ కెరియర్ కి కాస్త కూడా అడ్డు కాలేదనే  చెప్పాలి.

హీరో ప్రస్తుతం వరుస పెట్టి చిత్రాలను లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే.   దాదాపు అరడజను సినిమాలను సెట్స్‌ పైకి తీసుకువస్తున్నాడు అని తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఆల్రెడీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఒక సినిమాకు ఓకే చెప్పిన సంగతి విషయం తెలిసిందే. అలాగే,  భీష్మ మూవీ దర్శకుడు  వెంకీ కుడుమల తో మరో సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా భీమ్లా నాయక్ దర్శకుడితో కూడా ఓ మూవీ చేస్తున్నట్లు వినికిడి. అలాగే మరి రెండు, మూడు స్టోరీ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.    ఇలా వరుస చిత్రాలతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ హీరో ఒక్క బ్లాక్ బస్టర్ కనుక పడిందంటే ఇక రేస్ మామూలుగా ఉండదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: