తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్న హీరో లలో తలపతి విజయ్ ఒకరు. తలపతి విజయ్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆఖరుగా తలపతి విజయ్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పెరకెక్కిన బీస్ట్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసు (వారసుడు) అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ తమిళ్ లో వరసు అనే టైటిల్ తో తెరకెక్కుతూ ఉండగా , తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో ఈ మూవీ తీసుకెక్కుతుంది. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ  మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ నెల చివరి వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి , ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫుల్ స్పీడ్ లో ముగించి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: