టాలీవుడ్ స్టార్ హీరో ఇంకా జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్టైల్ కు ఇంకా అలాగే ఆయన యాటిట్యూడ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల వీరాభిమానులు ఉన్నారు.అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన పవన్.. సుస్వాగతం, తొలిప్రేమ లతో మంచి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఖుషి పవన్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఎస్ జే సూర్య దరర్శకత్వం వహించిన ఈ సంచలన విజయం అందుకుంది. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఖుషి. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీవీలో ఖుషి వచ్చిందటే చాలు ఛానల్ మార్చకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది.ఇటీవల టాలీవుడ్ లో నయా ట్రెండ్ ఒకటి హల్ చల్ చేస్తోంది. హీరోల బర్త్ డేలకు వల్ల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.


మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కంటిన్యూ అవుతోంది. మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి , ఒక్కడు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పవన్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ మరో సినిమా కూడా రిలీజ్ అవ్వనుంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీకున ఖుషి సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరియు అమెరికా.. ఆస్ట్రేలియా ఇంకా పలు దేశాల్లో కూడా ఖుషి సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఖుషి సినిమాను రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్స్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీర మల్లు అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: