‘ఆచార్య’ ఫెయిల్యూర్ తరువాత చిరంజీవి తాను నటిస్తున్న సినిమాల విషయంలో చాలలోతుగా ఆలోచిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి పక్కన బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరంజీవితో రవితేజా మరో హీరో పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


ఈమూవీలో చిరంజీవి సవితి తమ్ముడుగా రవితేజా నటిస్తున్నాడు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ మూవీ ఛాయలు ‘వాల్తేరు వీరయ్య’ లో ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఒక అతిధి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడట.


ఇప్పటికే వెంకటేష్ చిరంజీవి లపై ఈ మూవీకి సంబంధించిన సీన్స్ చిత్రీకరణ కూడ పూర్తి అయింది అంటున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ కథ రీత్యా కీలకంగా వచ్చే ఒక పాత్రలో నాగార్జున నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నాగార్జునను స్వయంగా కోరడంతో నాగ్ ఈమూవీలో వచ్చే ఈ కీలక పాత్రను చేయడానికి ముందుకు వచ్చినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున త్వరలో ఈమూవీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.


దీనితో ఈమూవీలో ఏకంగా నలుగురు హీరోలు కనిపించే మల్టీ స్టారర్ గా మారుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈమూవీ రాబోతున్న సంక్రాంతికి విడుదల అవుతున్న పరిస్థితులలో ఇంతమంది సీనియర్ హీరోలు ఈమూవీలో నటిస్తూ ఉండటంతో ఈమూవీకి భారీ కలక్షన్స్ రావడం ఖాయం అన్న అంచనాలు వస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తేనే ఆమూవీ పై భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ఏకంగా నలుగురు సీనియర్ హీరోలు నటిస్తూ ఉండటంతో ఈమూవీకి ఎన్ని వందల కోట్ల కలక్షన్స్ వస్తాయి అన్న అంచనాలు ఇప్పడి నుండి మొదలై ఈమూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరిగే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: