రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ట్రైలర్ విడుదలైంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో 'నందు విజయ్‌కృష్ణ' హీరోగా..
యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో..ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. 'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి వచ్చిన పాటలు అందరిని అలరించాయి.

సినిమా చూశాను చాలా బాగుంది...

సినిమా చూశాను చాలా బాగుంది..సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారని దర్శకుడు మారుతి తెలిపారు. '' దర్శకుడు విరాట్ ను పిలిచి నెక్స్ట్ మా బ్యానర్లో సినిమా చేయమని చెప్పాను. ట్రైలర్ లో చూసిన దానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా మొత్తం బాగుంటుంది. ఎప్పటినుంచో కష్టపడుతున్న 'నందు'కు ఈ సినిమా మంచి టేకాఫ్ ఇస్తుంది. రష్మిక కూడా ఈ సినిమాతో మంచి హీరోయిన్ అవుతుంది. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన నిర్మాతలకు మంచి మైలేజ్ వస్తుంది'అని మారుతీ అన్నారు.

రష్మీకి ఒక్క థ్యాంక్స్ చెబితే సరిపోదు

ఏ బ్యాక్ గ్రౌండ్ లేని తనకు 'సవారీ' సినిమా ద్వారా ప్రేక్షకులు సపోర్ట్ చేశారని హీరో నందు వెల్లడించారు. 'రష్మీ' దగ్గరికెళ్ళి చెబితే తనను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. పక్కా ఇల్లు కూడా లేని అచ్యుతాపురం అనే చిన్న ఊర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రష్మీ కొన్ని ఇబ్బందులకు గురయ్యిందన్నారు. రష్మీకి ఒక్క థ్యాంక్స్ చెబితే సరిపోదన్నారు. సినిమాతో పాటు పాటలు చాలా బాగా వచ్చినట్లు వెల్లడించారు. అనుకున్న బడ్జెట్ కంటే భారీ స్థాయిలో సినిమాను తీసుకొచ్చిన విజయీభవ ఆర్ట్స్ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడలకు ధన్యవాదాలు తెలిపారు.

రాయే రాయే పాట ఫేవరేట్ సాంగ్..

రాజ్ కిరీటి చెప్పిన కథను నమ్మి 'నందు' వచ్చి తనకు ఈ సినిమా కథ చెప్పారని యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ తెలిపారు. నందు ప్రొడ్యూస్ చేస్తుండడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చానన్నారు. 25 శాతం షూట్ అయిన తర్వాత అప్పటివరకు తీసిన కంటెంట్ నచ్చి విజయీభవ ఆర్ట్స్ ముందుకు వచ్చిందన్నారు. విరాట్ మీద నమ్మకంతో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారన్నారు. సినిమాలో మంచి రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినట్లు, 'రాయే రాయే' పాట తన ఫేవరెట్ సాంగ్ అన్నారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే ..

దర్శకుడు పూరీని ఇష్టపడే వ్యక్తిగా 'నందు'.. కొట్లాటంటే ఆసక్తి కనబరిచే అమ్మాయిగా 'రష్మీ' నటించారు. ఓ కథను పూరికి ఇవ్వడానికి హైదరాబాద్ కు వెళుదామని నందుకి తండ్రి చెబుతాడు. అనంతరం నందు, రష్మీ మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకొనేలా ఉన్నాయి. '' ఏం చేస్తామో... ఎట్టా చేస్తామో తెలియదు.. పరిస్ధితులను బట్టి గొడవ పెట్టుకోవాలి. అక్కడి నుంచి వాళ్లను తరిమి తరిమి.. అరటి తోటల మధ్యలో నుంచి తుపాన్ బిల్డింగ్ దాటించి, సరిగ్గా అడ్డరోడ్డు పక్కన ఉన్న ఎత్తిపోతల పొలంలోకి తీసుకెళ్లి.. ఏ ఎకరం పొలంలో అయితే గొడవ మొదలైందో అక్కడే ముగిద్దాం'' అంటూ నందు చెప్పే డైలాగ్ మెప్పించేలా ఉంది. ఈ మూవీ నవంబర్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: