చిత్ర ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఏ స్థితికి చేరుకుంటారో చెప్పడం అసాధ్యం మరీ. కొంతమంది తమ సినిమాల ద్వారా ఉన్నట్టుండి స్టార్ హీరో, హీరోయిన్ రేంజ్ కి వెళితే,

మరికొంతమంది జీరో పొజిషన్ కి కుడా చేరుకుంటూ ఉంటారు.. ఒక షో హిట్టు పడితే ఆకాశానికి ఎత్తేసే జనాలు.. ఒక్క షో ఫ్లాప్ అయితే పాతాళానికి  కూడా తొక్కేస్తారు. ఇక ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో సహజంగా జరుగుతూ ఉంటాయి మరీ, కానీ కొంతమంది మాత్రం స్టేటస్, సెలబ్రిటీలు అంటూ రేంజ్ చూడకుండా ప్రేమ , ఆప్యాయతలను పంచుతూ ఉంటారు. అలాంటి వారిలో కచ్చితంగా ముందుండే హీరోలలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు అని మనం చెప్పవచ్చు

నిజం చెప్పాలంటే అందరిలో కలగలసిపోయే తత్వం ఎన్టీఆర్లో మాత్రమే ఉందని  మనం చెప్పవచ్చు. ముఖ్యంగా నందమూరి హీరోలలో ఎవరిని తీసుకున్నా సరే ఎన్టీఆర్కి ఉన్న అభిమానులు ఏ ఒక్కరికి  ఉండరు ఆయనను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఆప్యాయతగా స్వీకరిస్తారు. అంతేకాదు ఏకంగా కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు కూడా సినీ ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో కావాలి అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్  కుడా ఇచ్చారు.. ఒక నటుడిగా, మనిషిగా, మానవత్వం కలిగిన మగాడిగా ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి అబ్బాయి హీరోగా ఉండాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే మాటలను మరొకసారి గుర్తు చేసింది  ఇప్పుడు మమత మోహన్ దాస్.

గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా  మనం చెప్పక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది ఈ బ్యూటీ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో మెరిసిన ఈమె స్టార్ హీరోయిన్ లిస్టులోకి కూడా చేరిపోయింది అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైంది మమత దాస్, అసలు విషయం ఏమిటంటే మమత ఆరోగ్యం బాగోలేక ఇండస్ట్రీకి దూరంగా ఉండింది నిజానికి ఆమెకు క్యాన్సర్ రావడం వల్లే క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు సమాచారం. ఇక తాజాగా తనతో పని చేసిన హీరోలు ఎవరు కూడా తనకు కాల్ చేసి ఎలా ఉన్నావని కనీసం పలకరింపు కూడా లేదని.. కేవలం ఎన్టీఆర్ ఒక్కడే కాల్ చేసి పలకరించాడని.. నేను ఆయనతో చేసింది యమదొంగ సినిమా మాత్రమే అయినా,. కానీ నన్ను ఆయన గుర్తు పెట్టుకొని మళ్ళీ పరికరించడం చాలా ఆనందంగా అనిపించిందినాకు.. నేను ఎంతోమంది హీరోలతో పని చేశాను కానీ ఏ ఒక్కరు కూడా అలా గుర్తుపెట్టుకొని మరి మాట్లాడింది లేదు.. అంటూ  బాగా ఎమోషనల్ అయింది. ఇక ఇది విన్న తర్వాత ఇండస్ట్రీకి నిజమైన హీరో.. ఒక్క మగాడు ఎన్టీఆర్ అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: