సోషల్ మీడియాలో ఏ విషయం ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. కానీ ఒకసారి ఏదైనా టాపిక్ వైరల్ అవుతుందంటే, ఆ టాపిక్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ చర్చలు, కామెంట్లు, మీమ్స్, వీడియోలు చేసేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హీట్‌గా ఉన్న విషయం — హీరోయిన్ రష్మిక మందన మరియు హీరో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం గురించి. ఇద్దరి రిలేషన్ గురించి రూమర్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్త నిజమా కాదా అన్నది అధికారికంగా రాలేదు కానీ, ఫ్యాన్స్ మాత్రం తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు.


ఇందులో ఎక్కువగా మాట్లాడుకుంటున్న మరో కోణం — రష్మిక గతం. రష్మిక మందన మొదట కిర్రాక్ పార్టీ సినిమా సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ అంతగా బలపడటంతో, ఇద్దరూ కుటుంబ సమక్షంలో గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ వేడుక అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది.  కానీ కొద్ది నెలలకే ఆ నిశ్చితార్థం రద్దయింది. ఆ సమయంలో ఎందుకు రద్దు చేసుకున్నారు? ఎవరు తప్పు చేశారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఎవ్వరూ ఇవ్వలేదు. కొంతమంది "రష్మిక కెరీర్‌ మీద ఫోకస్ పెట్టడానికి బ్రేకప్ తీసుకుంది" అన్నారు. మరికొందరు “రక్షిత్ శెట్టి ప్రవర్తనలో ఆమెకు నచ్చని మార్పులు వచ్చాయి” అన్నారు. మొత్తానికి ఎవరికీ అసలు కారణం తెలియదు, కానీ విడిపోవడం మాత్రం నిజం.


ఆ తర్వాత రష్మిక తన దృష్టిని పూర్తిగా సినిమాల మీద పెట్టింది. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి “గీతగోవిందం” సినిమాతో స్టార్‌ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా ద్వారా ఆమెకు విజయ్ దేవరకొండతో పరిచయం ఏర్పడింది. మొదట ఫ్రెండ్షిప్‌గా మొదలైన ఆ బంధం క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో పెద్ద చర్చ నడుస్తోంది . “రక్షిత్ శెట్టిలో లేనిది విజయ్ దేవరకొండలో ఏముంది?”..“ఎందుకు రష్మిక.. రక్షిత్‌ని వదిలి విజయ్‌ని ఎంచుకుంది?” ఫ్యాన్స్ ఇచ్చిన సమాధానాలు కూడా అంతే హాట్‌గా ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం..“రక్షిత్ శెట్టితో రష్మికకు కేవలం యూత్ అట్రాక్షన్ మాత్రమే ఉంది. ఆ సమయంలో ఆమె కెరీర్ ప్రారంభ దశలో ఉండటంతో, ఆ ఫీలింగ్‌నే లవ్‌గా భావించింది. కానీ విజయ్ దేవరకొండతో ఉన్న బంధం మాత్రం మెచ్యూర్‌డ్ రిలేషన్‌షిప్‌. వీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఈ ప్రేమ ఇంత దూరం వచ్చింది” అంటున్నారు.



మరికొందరు “విజయ్ దేవరకొండకు ఉన్న కాన్ఫిడెన్స్, చార్మ్, అటిట్యూడ్ — ఇవన్నీ రష్మికకు చాలా దగ్గరగా అనిపించాయి. అతని పాజిటివ్ వైబ్స్, సపోర్టివ్ నేచర్ రష్మిక మనసును గెలుచుకున్నాయి.”ఇంకా కొంతమంది అభిమానులు మాత్రం సరదాగా కామెంట్ చేస్తూ —“రక్షిత్‌లో ‘సింప్లిసిటీ’ ఉంది కానీ విజయ్‌లో ‘స్పార్క్’ ఉంది. అదే డిఫరెన్స్!” అంటూ నాటీగా స్పందిస్తున్నారు. మొత్తానికి రష్మిక–విజయ్ లవ్ స్టోరీ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ చేసిన టాపిక్‌గా మారిపోయింది.

ఇన్నాళ్లు స్నేహితులుగా, ప్రేమికులుగా ఉన్న ఈ జంట ఇప్పుడు భార్యాభర్తలుగా మారబోతుందంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. రష్మిక కూడా ఇప్పుడు కెరీర్ పీక్‌లో ఉంది, విజయ్ తన స్థాయిని మరింత బలపరుస్తున్నాడు.భవిష్యత్తులో రష్మిక ఏ విధమైన సినిమాలు చేస్తుందో, ఈ జంట ఎప్పుడు అధికారికంగా తమ సంబంధాన్ని ప్రకటిస్తారో చూడాలి...?

మరింత సమాచారం తెలుసుకోండి: