సినిమాలలో హీరోగా విలన్ గా నటిస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు సీనియర్ నటుడు జగపతిబాబు. ఇక  కెరియర్ మొదట్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించే ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న ఈయన బాలకృష్ణ నటించిన ది లెజెండ్ సినిమాతో విలన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి జగపతిబాబు తనకు హీరోగా సినిమాలలో నటించిన విలన్ పాత్రలలో నటించడం వల్ల 

ఎంతో మంది గుర్తింపు వచ్చిందని చెప్పారు.కాగా విలన్ పాత్రలకు ఈయన ఎంతో అద్భుతంగా సెట్ కావడంతో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించి ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నారు. గత కొద్ది కొద్ది రోజులుగా ఈయన ఆస్తిపాస్తుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈయన ఈ వార్తలపై ఎన్నోమార్లు స్పందించి తన ఆస్తుల గురించి తన సంపాదన గురించి చెప్పుకొచ్చారు. ఆయనప్పటికీ  ఇక ఏమాత్రం ఈయన ఆస్తుల గురించి వచ్చే వార్తలు ఆగకపోవడంతో తాజాగా ఈ వార్తలపై జగపతిబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ఈయన సాయిబాబాకు పూజ చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ తన ఆస్తుల గురించి వార్తల పై స్పందించి కౌంటర్ ఇచ్చారు.ఇక  ఈ క్రమంలోనే సాయిబాబాకు పూజ చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ దేవుడా అందరూ నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు వారికి సమాధానం చెప్పలేక చస్తున్నాను..ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటూ ఈయన తన ఆస్తుల గురించి వచ్చే వార్తల పట్ల స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: