మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి ఈ సంవత్సరం మొదటగా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం గాడ్ ఫాదర్. మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించాడు. మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో అతిథి పాత్రలో నటించాడు. సత్య దేవ్మూవీ లో విలన్ పాత్రలో నటించగా , లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.

ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు నుండి అనగా నవంబర్ 19 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా గాడ్ ఫాదర్ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా నవంబర్ 19 వ తేదీ నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: