టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని , వై వి ఎస్ చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన దేవదాస్ మూవీ తో తన కెరియర్ ను ప్రారంభించాడు. మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ హీరో ఇప్పటి వరకు అనేక మూవీ లలో హీరో గా నటించాడు. రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించాడు.

అలా రామ్ పోతినేని కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో ఈస్మార్ట్ శంకర్ మూవీ ఒకటి. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నాబా నటేష్ హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఇలా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మూవీ హిందీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ డబ్బింగ్ సినిమా యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇలా ఈస్మార్ట్ శంకర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: