పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. బాహుబలి సినిమా తో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు..అందుకే ఆయన రేంజ్ టాలివుడ్ నుంచి హాలివుడ్ వరకూ పెరిగింది.చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు డార్లింగ్.. యిప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా 150 కోట్లు అనే చెప్పాలి..అతనికున్న ఇమేజ్ వల్ల నిర్మాతలు కూడా అంత ఇవ్వడానికి వెనుకాడడం లేదు..200 కోట్లు అయిన కూడా ఇవ్వడానికి రెడీగా వున్నారు..


ఆ రేంజ్ లో వున్న ప్రభాస్ ఓ బ్యాంకులొ అప్పు తీసుకున్నారు అంటే నమ్మలేక పోతున్నారు కదూ..కానీ ఇది నిజం..ఏకంగా 21 కోట్ల రూపాయలు అప్పు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రాపర్టీ పెట్టి ప్రభాస్ ఈ రేంజ్ లో లోన్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది.నిజానికి సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ సొంత సినిమాలు అనే సంగతి తెలిసిందే. సాహో ఫ్రెండ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే..అదే విధంగా రాధేశ్యామ్ మూవీ గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది. భారీ బడ్జెట్లతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.


అయితే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్త్ లకు క్రేజ్, పాపులారిటీ ఉన్న దర్శకులే దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాలపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే..అందుకే ప్రభాస్ ఓ ప్రైవేట్ బ్యాంక్ లో 21 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని వార్త వినిపిస్తోంది. ప్రభాస్ భారీ మొత్తంలో అప్పు తీసుకున్నా ఆ అప్పును తక్కువ సమయంలోనే తీర్చేస్తాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజిగా వున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: