
ఈ క్రమంలోనే ఇందులో అరవిందస్వామి, సంతానం, కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు నటీనటులుగా నటించనున్నారు అని విగ్నేష్ శివన్ వెల్లడించారు. ఇకపోతే ముందుగా ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. నిజానికి త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమెకు వరుస అవకాశాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్న నేపథ్యంలో అజిత్ 62 సినిమాలో నటించడానికి ఆమె నిరాకరించింది.
ఈ క్రమంలోనే విగ్నేష్ తన భార్య సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ అది కూడా కుదరలేదు. అందుకే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్.. కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. వివాహం జరిగి ఒక బాబు జన్మించిన తర్వాత సినిమాలలో బిజీ కావడానికి ప్రయత్నం చేస్తుంది . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందని సమాచారం.