ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఇండస్ట్రీకి దూరమైన నేపథ్యంలో ఇక ఇప్పుడు సినీ పెద్దగా చిరంజీవి ఉంటే బాగుంటుంది అని ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ నటుల వరకు అందరూ కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి అనుకోవట్లేదు అని చెబుతున్న.. మీరే మాకు అండ దండ.. ఇక ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఇప్పటికి అందరూ అనుకుంటున్నారు అని చెప్పాలి. అయితే సీనియర్ స్టార్ హీరోలు చాలామంది ఉన్న చిరంజీవిని ఎందుకు ఇండస్ట్రీ పెద్దగా చూస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానాలు ఇప్పటివరకు ఎన్నో తేరా మీదికి వచ్చాయి.


 ఇక ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఎందుకు ఆయనే ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని అందరూ అనుకుంటున్నారు అన్న దానికి మరో సమాధానం దొరికింది  అని చెప్పాలి.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో  తెరకెక్కిన వాల్తేరు వీరయ్య అనే సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ముందుగా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే ముందుగా అనుకున్న ప్లేస్ లో కాకుండా చివరికి వేరే ప్లేస్ కేటాయించి ఇక్కడ ఈవెంట్ చేసుకోండి అంటూ జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.


 ఒక రకంగా  చెప్పాలంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అటు మెగాస్టార్ చిరంజీవిని కాస్త ఇబ్బందులకు గురిచేసింది అని చెప్పాలి. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా వాల్తేరు వీరయ్య రిలీజ్ ఈవెంట్లో ఇక ప్రభుత్వానికి అధికారాలకు థాంక్స్ చెప్పారు. దీంతో చిరంజీవి అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. అదేంటి మెగాస్టార్ కు ఇంత మంచితనం అవసరమా.. అన్నయ్య అసలు ఎందుకు తగ్గుతున్నాడు అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు చిరంజీవి.. తగ్గడం అవసరమే.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తాను ఫైర్ అయితే.. నా ఈగో సాటిస్ఫై అవుతుంది. కానీ సినిమా, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ అంతా సఫర్ అవ్వాలి. ఇది సినిమాకి అస్సలు మంచిది కాదు. అందుకే తగ్గడంలో తప్పులేదు అంటూ చిరు చెప్పారు. చిరంజీవి చెప్పిన మాటలు విన్న తర్వాత అందుకే అన్నయ్య మెగాస్టార్ అయ్యారు.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా  ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ గర్వపడుతున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: