
అయితే ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా రాజమౌళి ఎంతో ఒదిగి ఉంటాడు. నేను గొప్ప దర్శకుడు అయ్యాను ఇంకా తెలుగు హీరోలను పట్టుకుని పాకులాడటం ఎందుకు అని ఆలోచించకుండా... తన ప్రతీ సినిమా తెలుగు హీరో తోనే ఉంటుంది అనే క్లారిటీని ఎప్పుడు ఇస్తూ ఉంటాడు రాజమౌళి. అదే సమయంలో ఇప్పుడు రాజమౌళి క్రేజ్ దృశ్య అతనితో ఒక్క సినిమా చేసిన చాలు అని స్టార్ హీరోలు సైతం కోరుకునే రేంజ్ ఉంది అని చెప్పాలి.
అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో ఇప్పటికే ఒకటికి మించి సినిమాలు చేసిన రాజమౌళి ఇక ఇప్పుడు మొదటిసారి మహేష్ బాబుతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు వరకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో మాత్రం అటు రాజమౌళి ఒక్క సినిమా కూడా తీయలేదు. దీనికి కారణంతో రాజమౌళికి అల్లు ఫ్యామిలీతో ఉన్న విభేదాలు అన్న టాక్ తెరమీదకి వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. అయితే ఈ సినిమా వసూళ్లను లెక్కలు బయటకు చెప్పొద్దని అలాగే మగధీరను తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని రాజమౌళి కోరాడట. కానీ అల్లు అరవింద్ అందుకు ఒప్పుకోలేదు. లెక్కలు మొత్తం బయటికి చెప్పేసాడట. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీతో రాజమౌళికి అస్సలు పొత్తు కుదరడం లేదు అన్నది తెలుస్తుంది.