సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శ్రీకాంత్ మరియు ఒకప్పటి నటి ఊహ ల కూతురు మేధా  చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే ఈమె త్వరలోనే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2016లో అక్కినేని నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో తన కొడుకు రోషన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత తన రెండవ సినిమా పెళ్లి సందడితో మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం మంచి హిట్ కొట్టేందుకు కష్టపడుతున్నాడు రోషన్. అయితే మేధా కూడా చాలా అందంగా ఉంటుంది. 

సాధారణంగా ఈమెని ఎవరైనా చూస్తే హీరోయిన్ అని అనుకుంటున్నారు. తన తల్లి ఊహ తనని సినిమాల్లోకి పంపించేందుకు చిన్నప్పటినుండి తనకి క్లాసికల్ డాన్స్లు శిక్షణ కూడా ఇప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సరైన కథ దొరికితే కచ్చితంగా తనను సినిమాల్లోకి పంపించడానికి తన తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ప్లస్ టు కంప్లీట్ చేసి డిగ్రీలో జాయిన్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ పైనే ఉందని స్టడీస్ పూర్తయిన వెంటనే సినిమాల్లో ఖచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది..

చదువుతోపాటు ఆటల్లో కూడా ఎప్పుడు ముందుంటుంది మేధా.. తనకి బాస్కెట్బాల్ ఆడడం అంటే చాలా ఇష్టమని.. తన అన్న రోషన్ తను చిన్నప్పుడు నుండి చాలా అల్లరి చేసే వాళ్ళమని.. కానీ ఎప్పుడు మాత్రం అలా కాదు అని.. ఆమె చెప్పుకొచ్చింది పిల్లలకు చదువుతోపాటు మంచి సంస్కారం వినయం పద్ధతిని మేము నేర్పించామని.. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీల పిల్లలతో మాతృభాషలో మాట్లాడితే సిగ్గుగా ఫీల్ అవుతారని.. కానీ మా పిల్లలు మాత్రం అలా కాదని చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడతారు అంటూ చెప్పవచ్చింది ఆమె.. అంతే కాదు పెద్దలు అంటే చాలా గౌరవిస్తారు అని  తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: