సాండిల్ వుడ్  స్టార్ హీరోలు అయినటువంటి ఉపేంద్ర ... కిచ్చ సుదీప్ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోలుగా నటించి శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉంటే వీరిద్దరూ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఇది ఇలా ఉంటే అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు తాజాగా కబ్జా అనే మూవీ లో కలిసిన నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ మూవీvకి ఆర్ చంద్రు దర్శకత్వం వహించగా ... శివ రాజ్ కుమార్మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మార్చి 17 వ తేదీన మలయాళం , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

ఈ ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇలా భారీ అచనాలు కలిగి ఉన్న ఈ మూవీ యొక్క తమిళ హక్కులను ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క తమిళ హక్కులను లైకా సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ తమిళ వర్షన్ ను తమిళనాడు లో భారీ థియేటర్ లలో విడుదల చేయడానికి లైకా సంస్థ వారు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: