తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ తో సాక్షి వైద్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. సాక్షి వైద్య ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే సైరా నరసింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను పాన్ ఇండియా మార్కెట్ లో సంపాదించుకున్న సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ...  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ... ఈ టీజర్ లో అఖిల్ లుక్స్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది.  ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ లో అఖిల్ ఇంట్రడక్షన్ కు సంబంధించిన సీన్ ... అలాగే ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో ఈ సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే అఖిల్ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: