వెబ్ సీరిస్ అంటే చాలామందికి బోర్ అనే ఫీలింగ్ అయితే ఉండేది. ఎప్పుడైతే మిర్జాపూర్ సీరిస్ విడుదల అయ్యిందో కానీ , వెబ్ సీరిస్ కు వున్న క్రేజ్ ఎంటో అప్పుడు తెలిసింది

మిర్జాపూర్ తర్వాత అలాంటి వెబ్ సీరిస్ చూడాలని చాలామంది కూడా అనుకున్నారు. కానీ ఆస్థాయి సీరిస్ లు మాత్రం రాలేదని చెప్పాలి. ఆ తర్వాత చాలరోజులకు రానా నాయుడు అనే వెబ్ సీరిస్ అలాంటి కంటెంట్ తో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇందులో బోల్డ్ సీన్స్ అలాగే బూతు డైలాగ్స్ ఉన్నప్పటికీ నెట్ ఫిక్స్ లో భారీ రేంజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హీరో నాని రానా నాయుడు పై రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది..

ఈ సిరీస్ గురించి నాని మాట్లాడుతూ.. రానా ఎప్పుడు కూడా కొత్తగా చేయడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతరులు చేసే దాన్ని మనం ఎందుకు చేయకూడదు అంటూ ప్రయత్నించే క్రమంలో రానా ఈ సిరీస్ ను చేశాడని తాను భావిస్తున్నట్లుగా నాని పేర్కొన్నాడు. ‘రా’ అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రానా కు ఇది ఒక మంచి ప్రయోగం అన్నట్లుగా తన అభిప్రాయం తెలియజేశాడు.

రానా ముందు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. రానా ఇలాంటి ప్రయోగాలను చేయడం ద్వారా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడని నాని పేర్కొన్నాడటా.వెబ్ సిరీస్ ల్లో నటించాలనే ఆలోచన వచ్చిన నేపథ్యంలో మొదట ఇలాంటి విమర్శలు వస్తుంటాయి కానీ భవిష్యత్తులో అంతా కూడా వెబ్ సిరీస్ ట్రెండ్ ను ఫాలో అయ్యే అవకాశాలు కూడా వున్నాయని నాని పేర్కొన్నాడు. అయితే రానా మరియు వెంకీ ఇలాంటి పాత్రలు చేయడాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం కూడా సహించలేకపోతున్నారు. బోల్డ్ కంటెంట్ దృష్టిలో పెట్టుకొని రానా 'ఫ్యామిలీతో ఈ సినిమా చూడొద్దని' ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: