తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో గోపీచంద్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ , శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా , జగపతి బాబు , కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు మిక్కీ జై మేయర్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు కూడా దక్కడం లేదు. దానితో ఈ మూవీ.కి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కంటే ముందు గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇలా వరుసగా గోపీచంద్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ హీరో యొక్క రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అని నిర్మాతలు కోరుతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. రామబాణం మూవీ వరకు 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న గోపీచంద్ తన తదుపరి మూవీ కి మాత్రం 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే బాగుంటుంది అని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గోపీచంద్ రేంజ్ కు సరిపడే మూవీ సెట్ అయితే ఆయన జోష్ ను ఆపడం కష్టం అని ... ఆయన సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తాయి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: