అంతేకాదు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో కిసాన్ వికాస్ పాత్ర స్కీం కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెడితే మీరు పెట్టిన డబ్బులు డబుల్ చేసుకోవచ్చన్నమాట.
అయితే ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం 115 నెలలు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలి అని అనుకునే వారు దగ్గర కనిష్టంగా 1000 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇందులో గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఎంతైనా వీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం ఈ పథకం ద్వారా మీకు 7.5% వడ్డీ కూడా లభిస్తుంది. 115 నెలల్లో మీ డబ్బును మీరు రెట్టింపు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ .5లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే.. 115 నెలల్లో మీ డబ్బు రూ .10లక్షల అవుతుంది. ఇకపోతే సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ వంటి ఫెసిలిటీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా 10 సంవత్సరాల దాటిన మైనర్లు వారి ఖాతాలను వారే నిర్వహించుకోవచ్చు. రాబడి అధికంగా ఉంటుంది కాబట్టి డబ్బులు దాచుకోవాలి అనుకునేవారు ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం మాత్రమే కాదు రికరింగ్ డిపాజిట్స్ స్కీం కూడా అందుబాటులో ఉంది. ప్రతినెలా చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని భావించేవారు ఈ పథకంలో చేరవచ్చు ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఇందులో 6.5% వడ్డీ కూడా లభిస్తుంది. ఇక ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ మీ ఖాతాలో వచ్చి చేరుతుంది . ఇలాంటి పథకాలు మీకు డబ్బును భారీగా అందిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి