పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే మాములు విషయం కాదు..ఆయనతో సినిమా చేయాలనీ పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆసక్తిగా చూస్తుంటారు.. దానికి తోడు అయన రాజకీయాల్లోకి వెళ్లారు.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు.. ఈ నేపథ్యంలో అయన మళ్ళీ రాజకీయాల్లో కి వెళ్లేముందు వీలైనన్ని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందుకే నాలుగు సినిమాలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో టాప్ దర్శకులకే పవన్ తో సినిమా చేసే అవకాశం లభిస్తుంది. దానికి తగ్గట్లే పెద్ద దర్శకులతోనే పవన్ సినిమాలు అనౌన్స్ చేశాడు.