స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ గారి గురించి, అయన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాగుబోతు పాత్రలకు అయన పెట్టింది పేరు. అయన లేకుండా సినిమా వచ్చేది కాదంటే అయన ఎలాంటి ఆర్టిస్ట్ అనేది చెప్పాలి.. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్స్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది.. ఓ ప్రేక్షకుడు ఒత్తిడిని తట్టుకోవడానికి సినిమా కి వస్తే ఆ వత్తిడి ని తగ్గించడానికి కమెడియన్ కాసేపు నవ్విస్తాడు. మనసుకు ఉపశమనం లాంటి కమెడియన్ చేసే జోక్ లను ఎంజాయ్ ప్రేక్షకుడు ఆ కమెడియన్స్ పై ఎంతో ప్రేమ ను అభిమానం రూపంలో చూపిస్తుంటారు.