సినిమా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ ల మధ్య సంబంధాలు ఎంత పవిత్రంగా ఉంటాయంటే బయట వాళ్లకి అది ఎలా అనిపించినా వారికి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఏంటో వారికే తెలుస్తుంది.. టాలీవుడ్ ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన హీరోయిన్ సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలింది సౌందర్య.. టాప్ హీరోలందరూ ఆమెతో నటించాలనుకునేవారే.. ఆమె డేట్స్ లేవంటే ఆమెకోసం వెయిట్ చేసి మరీ డేట్స్ ఖాళీ అయ్యాక ఆమెతో సినిమాలు చేసేవారు. అందం, అభినయం కలిగిన సౌందర్య అన్ని పాత్రల్లో తనదైన మార్క్ చూపించేది.. ఎలాంటి క్యారెక్టర్ లోఅయినా యిట్టె ఒదిగిపోయి దర్శక, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేది.