కర్తవ్యం చిత్రాన్ని కిరణ్ బేడీ జీవిత కథ ఆధారంగా తీసుకొని, కొద్దిగ డ్రామాను యాడ్ చేసి, పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్ కు మోహన్ గాంధీ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఓ నిజాయితీ గల పోలీస్ అధికారిణి అంగబలం,డబ్బు బలం కలిగిన అవినీతి పరులను, రౌడీలను ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా స్టోరీ.. ఒక్కసారిగా ఈ సినిమా విజయశాంతి కెరియర్ ని చేంజ్ చేసింది..అప్పటి వరకు ఓ సాధారణ హీరోయిన్ గా గుర్తింపు పొందిన విజయశాంతి, ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంకా చెప్పాలంటే టాప్ హీరోలకు సైతం పోటీనిచ్చేలా నిలబడింది. ఈ సినిమాకు గానూ విజయశాంతి నటనకు నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా లభించింది. అయితే ఈ చిత్రానికి కేవలం రూ. 90 లక్షల బడ్జెట్ తో తీసినా, ఈ సినిమా దాదాపు రూ.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది.