నందమూరి ఫ్యామిలీ హీరోలు అంటే వై.వి.యస్.చౌదరి కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వారి పై ఉన్న అభిమానాన్ని, ప్రేమను వైవిఎస్ చౌదరి తన సినిమాల ద్వారా ఇప్పటికే చూపించారు. ఈ క్రమంలోనే ఆయన నందమూరి హీరో లతో వరుసగా సినిమాలు తీయగా వాటిలో కొన్ని హిట్ లు సాధించగా మరికొన్ని ఫ్లాప్ లుగా మిగిలాయి. అలా బాలకృష్ణ హీరోగా వైవీఎస్ చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఒక్క మగాడు.కమల్ హాసన్ భారతీయుడు సినిమా కాన్సెప్ట్ తరహా లో తెరకెక్కిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.