అల్లరి సినిమాతో ఈ జెనరేషన్ రాజేంద్ర ప్రసాద్ దొరికేశాడు అనిపించిన నరేష్ ఈ మధ్య సినిమాలను హిట్ కొట్టడంలో కాస్త వెనుకపడ్డాడు. కెరియర్ మొదట్లో దూసుకెళ్లిన అల్లరోడు ఇప్పుడు రేసులో వెనుకపడ్డాడు. అయితే దీనికి కారణాలు తనలా పేరడి కామెడీ చేసే హీరోలు ఎక్కువవ్వడం ఒకటైతే లాజిక్ లేని కామెడీతో ఆడియెన్స్ బుర్ర పాడుచేస్తుండటం ఒకటి.


సినిమాలైతే చేస్తున్నా హిట్ కు దూరంగా ఉంటున్న అల్లరి నరేష్ ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయిన ఓ మలయాళ సినిమాతో రాబోతున్నాడు. ఒరు వడక్కన్ సెల్ఫీ అనే సూపర్ హిట్ సినిమా రీమేక్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే హీరో క్యారక్టర్ కామెడీని పండిస్తూనే కాస్త ఎమోషనల్ ట్రీట్ చేస్తాడట.


అయితే ఇలాంటి అనుభవం గమ్యం సినిమాతో ఆల్రెడీ సాధించాడు అల్లరి నరేష్. గమ్యంలో గాలి శీను పాత్రలో అద్భుతమైన నటన కనబరచి నంది కూడా దక్కించుకున్న అల్లరి నరేష్ ఆ తరహా పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శంభో శివ శంభో సినిమా కూడా నరేష్ తన రోల్ కు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు.


అందుకే నరేష్ ఈసారి ఎమోషనల్ డ్రామాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే తన ల్యాండ్ మార్క్ కామెడీ చేస్తూనే సినిమా కంటెంట్ తగ్గట్టు ఆ సినిమాలో హ్యూమన్ ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడట. అలా ఎలా డైరక్టర్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జాహ్నవి క్రియేషన్స్ బ్యానర్లో బొప్పన చంద్ర శేఖర్ నిర్మిస్తున్నారు. 


మరి అనుకున్న విధంగానే అల్లరోడు ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ న్యూస్ అయ్యింది. తన సక్సెస్ కోసం అటు పరిశ్రమ వ్యక్తులే కాదు సిని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నా అల్లరి నరేష్ కు టైం ఏమాత్రం కలిసి రావట్లేదు మరి ఈ రీమేక్ తో అయినా మనోడి ఫేట్ మారి ఇకనుండి సూపర్ హిట్లు కొట్టేయాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: