సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ డం గురించి మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరచాడు. మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారని అంటున్న మహేష్ తన దృష్టిలో మాత్రం ఇద్దరే సూపర్ స్టార్స్ అని తేల్చాడు.


చిరంజీవి, రజినికాంత్ లే అసలు సిసలైన సూపర్ స్టార్స్ అన్న్న మహేష్ సినిమాతో సంబంధం లేకుండా వాళ్ల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తారని అన్నారు. ఇక తన దృష్టిలో నటుడు, స్టార్ అన్న వాటి కన్నా సినిమా అనేదే చాలా గొప్పదని ప్రస్తావించారు మహేష్. స్పైడర్ తో తొలిసారిగా తమిళ పరిశ్రమలో అడుగు పెడుతున్న మహేష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


స్పైడర్ విషయానికి వస్తే మురుగదాస్ డైరక్షన్ లో ఓ రేసీ మూవీగా ఈ స్పైడర్ రాబోతుంది. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. తుపాకి టైంలోనే మురుగదాస్ తో పనిచేయాల్సి ఉన్నా అది ఇప్పటికి నెరవేరిందని అన్నారు మహేష్. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను మంచి థ్రిల్ కు గురి చేస్తుందని అన్నారు.


దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. మరి అంచనాలను అందుకునేలా సినిమా రికార్డులు సృష్టిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: