యంగ్ హీరో నితిన్ కు తన ప్రేయసి షాలిని రెడ్డి తో అలా పెళ్లి కుదిరిందో లేదో నితిన్ పట్టిందల్లా బంగారం అవుతుంది. నితిన్ ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన భీష్మ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నితిన్‌కు చాలా యేళ్ల తర్వాత ఇంకా చెప్పాలంటే సుమారు ఆరేళ్ల తర్వాత అ..ఆ సినిమా తర్వాత మళ్లీ సూపర్ హిట్ భీష్మ రూపంలో దక్కింది. సంక్రాంతి సినిమాల తర్వాత వేరే హిట్ సినిమా లేకపోవడం, భీష్మకి అత్యధిక థియేటర్స్ దొరకడం, పాజిటివ్ టాక్ ఇలా అన్నీ కలిసి నితిన్ కి ఫస్ట్ వీకెండ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.
అ.. ఆ సినిమా తర్వాత దాదాపు ఐదారేళ్లుగా సరైన హిట్ లేక విలవిల్లాడుతోన్న నితిన్‌కు ఎట్టకేలకు భీష్మ రూపంలో మంచి హిట్ వచ్చింది. భీష్మ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆంధ్ర – తెలంగాణాలో 14.9 కోట్ల షేర్ సాధించింది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ తో మొదటి వారం పూర్తయ్యే టైంకి నైజాం, ఉత్తరాంద్రలో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వగా మిగిలిన ఏరియాల్లో కూడా లాభాల్లోకి వచ్చేసింది.
ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు.23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసి లాభాల భాటలోకి ఎంటర్ అయ్యింది. నైజాంలో దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమాతో భారీ లాభాలు ఆర్జించడం ఖాయమైంది. ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాంలో ఫస్ట్ వీక్ ముగిసే సరికే 7.52 కోట్లు - సీడెడ్ – 2.9 కోట్లు - గుంటూరు – 1.58 కోట్లు - ఉత్తరాంధ్ర – 2.55 కోట్లు - ఈస్ట్ – 1.48 కోట్లు - వెస్ట్ – 1.2 లక్షలు - కృష్ణా – 1.33 లక్షలు నెల్లూరు – 60 లక్షలు షేర్ రాబట్టింది.
ఇప్పటికే వరల్డ్ వైడ్ భీష్మ ఫస్ట్ వీక్ షేర్ రు. 24.06 కోట్లు కొల్లగొట్టింది. నితిన్ మార్కెట్ తో టైర్ టు స్టార్ హీరోలు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు తమ టైర్ టు రేంజ్ హీరోల్లో నితిన్ పోటీలో లేడనుకుంటున్న టైంలో నితిన్ ఒక్కసారిగా దూసుకు వచ్చి రేస్‌లోకి రావడంతో టైర్ టు స్టార్ హీరోల రేస్ ఆసక్తిగా మారింది.