ఏపిలో గత కొన్ని రోజులు నుంచి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారే రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీలోకి కొంత మంది నేతలు జంప్ కావడం ఆయా పార్టీ నాయకులకు మింగుడు పడకుండా ఉంది.  అయితే సీఎ జగన్ చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై తామంతా వైసీపీలోకి వెళుతున్నామని అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ట్విస్ట్ నెలకొనడంతో ఏపిలో రాజకీయంగా చర్చలు నడుస్తున్నాయి.  మరోవైను వైసీపీ నేతలు మరిన్ని వలసలు ఉంటాయని అంటున్నారు.   

 

సీఎం జగన్ చేస్తున్న అభివృద్ది పనులకు ప్రజలు మాత్రమేకాదు  నాయకులు కూడా సంతోష పడుతున్నారని.. అందుకే అధికార పార్టీలోకి వస్తున్నారని.. దాంతో వైసీ బలం పెరుగుతుంది.. మరింత అభివృద్ది జరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు టీడీపీ, జనసేన, బిజెపి నేతలు అధికార పార్టీపై మండి పడుతున్నారు.  ఇక జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై, నాయకులపై సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు.  కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల వెబ్ సైట్స్ లో విమర్శిస్తుంటే ఆశ్చర్య పోయాం.

 

మీరు వైసీపీ ని సమర్ధిస్తే తప్పు లేదు.. కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఎడవలో అర్థం కాలేదు. లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. బాధ పడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి" అని అన్నారు. ఆ తర్వాత మరో ట్విట్ లో కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు. భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం. ఫోకస్ ఆన్ ఇట్. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి. 151 మంది ఎంఎల్ఏలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం. థాంక్స్ సీఎం గారు" అని నాగబాబు అన్నారు.  తాజాగా ఈట్విట్స్ వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: