పవన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరె హీరోకి అయినా ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి ఎదిగిపోయి ఉండేవాడు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ పవన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు. రాజకీయాలలో ప్రవేశించి ఘోరంగా ఓడిపోయినా పవన్ ఇమేజ్ ఏమాత్రం డామేజ్ కాలేదు.
ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న పవన్ తాను ఎంచుకున్న సినిమాల కథల విషయంలో మళ్ళీ తప్పు చేస్తున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. పవన్ రీ ఎంట్రీ మూవీగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీ కథ ఇప్పటికే అందరికీ తెలిసిన కథ.
దీనికితోడు ఈమూవీలో పవన్ లుక్ ఏమాత్రం బాగాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమాకు వచ్చే ఓపెనింగ్స్ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేకపోయినా ఈమూవీ సగటు ప్రేక్షకుడుకి కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ నిరాశ పవన్ అభిమానులకు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈమూవీ తరువాత క్రిష్ తో చేయబోతున్న మూవీ కూడ జానపద కథలా ఉండే ఒక చారిత్రాత్మక నేపద్యం ఉండే మూవీ.
ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచి మారడంతో చారిత్రాత్మక నేపధ్యం ఉన్న సినిమాలను పెద్దగా ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో పవన్ తో హరీష్ శంకర్ తీయబోతున్న మూవీ పై అదేవిధంగా సురేంద్ర రెడ్డి పవర్ స్టార్ తో తీయబోతున్న మూవీలు మాత్రమే పవన్ ను గట్టేక్కిస్తాయి అన్న అభిప్రాయంలో పవన్ అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ ‘అయ్యప్పనం కోషియం’ మళయాళ మూవీ తెలుగు రీమేక్ లో నటించడానికి ఓకె చేసాడు అని వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన మళయాళ మాతృకలో బిజు మీనన్ నటించిన పాత్రకు పవన్ ఓకె చెప్పాడు అన్న లీకులు వింటూ పవన్ అభిమానులు హడలిపోతున్నారు. పవర్ స్టార్ ను మరొకసారి గబ్బర్ సింగ్ గా చూడాలి అని కలలు కంటున్న పవన్ అభిమానులకు వారి హీరో వరసపెట్టి ఒప్పుకుంటున్న సినిమాల లిస్టు చూసి హడలి పోతున్నారని టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి