నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్ హాజరుకాలేదు. నిజానికి ఈ సినిమాలో ఈమె లాయర్ గా ఒక కీలకమైన పాత్ర పోషించారు. కానీ ఈ సినిమా ప్రచార కార్యక్రమానికి మాత్రం రాలేకపోయారు. ముంబైలో తన తదుపరి సినిమాల షూటింగ్ తో చాలా బిజీ గా ఉండటం వల్ల తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో ఆమె రాకపోవడానికి మరే ఇతర కారణం లేదని స్పష్టమైంది.


 
కానీ రకుల్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకుల్ సినిమా షూటింగ్ ని ఒక్క రోజుకి పోస్ట్ పోన్ చేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటే బాగుండేది కదా అని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టడం దర్శకుడిని, హీరోని, నిర్మాతని అగౌరవపరిచేనట్లే అని మరికొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 
బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినంత మాత్రాన టాలీవుడ్ ని మరీ చీప్ గా చూడాల్సిన అవసరం ఏమీ లేదని రకుల్ కి అభిమానులు హిత బోధ చేస్తున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోయినా.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిన ఇంటర్నెట్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ మూవీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
ఇకపోతే ఎటువంటి కామెడీ సన్నివేశాలు, పాటలు లేకుండా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకి ఫిబ్రవరి 26వ తేదీన చెక్ సినిమా రాబోతోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో సరైన హిట్ సినిమాలు లేక ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు నితిన్. మరి ఆయనకు చెక్ సినిమా మంచి హిట్ తెచ్చి పెడుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలియనున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: