‘గోపాల గోపాల’ సినిమాకు 40 కోట్ల మైలురాయిని చేరుకుందని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న వీకెండ్ సెలవుల కలెక్షన్స్ తో తాము గట్టున పడతామని గోపాలుడి బయ్యర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే పవన్ విశ్వరూప సీన్ కు సంబంధించి ఒక ఆ శక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

ఈ సన్నివేశం షూటింగ్ దగ్గర నుండి ఆ సన్నివేశగ్రాఫిక్స్ వరకు పవన్ తానే అన్ని విషయాలు స్వయంగా పర్యవేక్షించాడు అని టాక్. ఈ సినిమా విజువల్ గ్రాఫిక్స్ పిక్స్ లాయిడ్ కంపెనీ వారు చేసినా విశ్వరూపం సీన్ కు సంబంధించి పవన్ దగ్గర ఉంది ఆ సీన్ ఎలా గ్రాఫిక్ డిజైన్ చేయాలో విడమరిచి చెప్పాడట.

‘జానీ’ తరువాత దర్శకత్వానికి దూరంగా ఉన్న పవన్ తిరిగి తనలోని దర్శకుడు కోణాన్ని బయటకు తీసి ఈ విశ్వరూప సీన్ డిజైనింగ్ విషయంలో పవన్ చూపెట్టిన శ్రద్ధతో పాటు ఇచ్చిన సలహాలను బట్టి మళ్ళీ ఎదో ఒక రోజు పవన్ లోని దర్శకుడు బయటకు వస్తాడు అని అనిపించేడట్లుగా చేసిందని ఆ సీన్ డిజైనింగ్ లో పాలు పంచుకున్న పిక్స్ లాయిడ్ కంపెనీ వారు అన్నట్లు టాక్.

పవన్ కంప్యూటర్ వద్ద తన విశ్వరూప సీన్ ను తానే చూస్తూ సలహాలు ఇస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు రావడంతో పవన్ లో ఉన్న దర్శకుడు మళ్ళీ బయటకు వచ్చాడు. గోపాలుడు సినిమాలో తనలోని దర్శకుడిని బయటకు తీసిన పవన్ త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ విషయంలో చాల సలహాలు ఇస్తున్న వార్తలను బట్టి పవన్ లోని రచయిత బయటకు వస్తాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: