దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది...ఇప్పటికే రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది.. దీంతో మరోసారి సినిమా పరిశ్రమకు గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో సినిమాలు విడుదల, షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. విడుదల తేదీని ప్రకటించడానికి ఏ నిర్మాత సిద్ధంగా లేరు.టాలీవుడ్ లోనూ ఇప్పుడు అదే పరిస్థితి. కరోనా తీవ్రత పెరగడంతో 'లవ్ స్టోరీ', 'టక్ జగదీష్', 'విరాటా పర్వం', 'ఆచార్య' మూవీల విడుదల తేదీలను మార్చారు..ఈ చిత్రాలు ఏవీ కూడా పోస్టర్లు లేదా టీజర్లపై విడుదల తేదీలను ప్రకటించడం లేదు.

 కానీ రవితేజ, నందమూరి బాలకృష్ణ మాత్రం దూకుడుగా వెళుతున్నారు.. మే 28 న ఒకరితో ఒకరు పోటీ పడేలా కనిపిస్తోంది.నిన్నటి పోస్టర్లలో నందమూరి బాలకృష్ణ 'అఖండ' విడుదల తేదీని మే 28గా నిర్ణయించారు. ఇక రవితేజ 'ఖిలాడి' టీజర్‌లో కూడా అదే తేదీ ఉంది. రెండు సినిమాలు మే 28వ తేదీన బాక్స్ ఫీస్ ఫైట్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ కరోనా కల్లోలంలో అసలు సినిమాలు విడుదల చేయడమే సాహసం అంటే ఇలా స్టార్ హీరోలు ఒకతేదీన రావడంపై ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.ఈ ఇద్దరు ఒకే రోజుసినిమా విడుదల చేస్తే ఇండస్ట్రీకి నష్టం అంటున్నారు.

అయినా రాబోయే రోజుల్లో కరోనా వేవ్ ఎలా మారుతుంది? పరిస్థితి ఎలా మారుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.బాలకృష్ణ -బోయపాటి కలిసి తీస్తూ మూడో మూవీ 'అఖండ'. తాజా టీజర్ మరియు పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. రవి తేజ 'క్రాక్' తో భారీ విజయం సాధించి తిరిగి ఫాంలోకి వచ్చాడు..ఇక గతంలో ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలతో చాలాసార్లు పోటీ పడ్డారు.. అయితే అందులో ఎక్కువ సార్లు మాత్రం మన మాస్ మహరాజా రవితేజ దే పై చేయి అయింది..ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత వీరి మధ్య పోటీ నెలకొనడంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుపు సాధిస్తారు అనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: