సాధారణంగా మన స్టార్ హీరోలు ద్విపాత్రాభినయం చేస్తున్నారు అంటే చాలు , ప్రేక్షకులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కానీ అదే స్టార్ హీరోలు ఏకంగా మూడు పాత్రలతో వచ్చి, ప్రేక్షకులను అలరిస్తే  ఇక చెప్పడానికి మాటలు కూడా రావు. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో సినిమాలలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే ఆ స్టార్ హీరోలు ఎవరు ? ఆ సినిమాలు ఏవి ?  ఆ పాత్రలు ఏవి ? అన్న విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


1. మెగాస్టార్ చిరంజీవి - ముగ్గురు మొనగాళ్లు:
దర్శకధీరుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసి, 1994 జనవరి 7వ తేదీన విడుదల చేశారు. ఇందులో చిరంజీవి మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసి , మంచి ప్రేక్షకాదరణ పొందారు. కానీ ఈ సినిమా యావరేజ్ హిట్ టాక్ ను అందుకుంది. ఇక ఇందులో చిరంజీవి మూడు పాత్రలకు గాను హీరోయిన్ లు నగ్మా ,రోజా , రమ్యకృష్ణ లు నటించడం విశేషం. పృథ్వి , విక్రమ్, దత్తాత్రేయ పాత్రలలో చిరంజీవి మనకు కనిపించారు.

2. విక్రమ్ - అపరిచితుడు:
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  విక్రమ్ హీరోగా తమిళ వర్షన్ "అన్నియన్" చిత్రం రీమేక్ గా 2005 జూన్ 17 వ తేదీన తెలుగులో  విడుదలైన చిత్రం అపరిచితుడు. సమాజంలో ప్రతిచోట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడంలో విఫలమై, మానసిక క్షోభకు లోనయి రాము కాస్త అపరిచితుడి గా మారి  అత్యద్భుతంగా నటించాడు. ఇక లవర్ బాయ్ గా రేమో ఈ పాత్రలో మనకు కనిపిస్తాడు. విక్రమ్ ఏకంగా మూడు పాత్రల్లో నటించి అందరిని మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో రాము, రెమో ,అపరిచితుడి పాత్రలో మనకు విక్రమ్ కనిపిస్తారు. ఇక హీరోయిన్ గా సదా నటించింది.

3. సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఆరు చిత్రాలలో త్రిపాత్రాభినయం చేసి అందర్నీ మెప్పించారు. రక్త సంబంధాలు ,బొబ్బిలి దొర, బంగారు కాపురం, పగబట్టిన సింహం ,సిరిపురం మొనగాడు, కుమార రాజా వంటి చిత్రాలలో త్రిపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ.

4. ఎన్టీఆర్ - జై లవకుశ:
జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా జై లవకుశ చిత్రం ద్వారా త్రిపాత్రాభినయం చేసి అందరిని మెప్పించాడు. ఇక ఇందులో జై, లవ, కుష పేర్లతో  డాన్, బ్యాంక్ మేనేజర్,  దొంగ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఇందులో నివేదాథామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు.

5. దాన వీర శూర కర్ణ:
లెజెండరీ , అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు త్రిపాత్రాభినయంలో నటించిన సినిమా దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా మూడు పాత్రలలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.


మరింత సమాచారం తెలుసుకోండి: