
హీరో రాజశేఖర్ సతీమణి జీవిత మన అందరికీ సుపరిచితమైన నటీమణి. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జీవిత ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కీలక భూమిక పోషిస్తుంది. దర్శకురాలిగా కూడా తన ప్రతిభ ను చాటిన జీవిత చాలా రోజుల పాటు హీరోయిన్ గా చక్రం తిప్పిన నటీమణి. ఈమె సినిమా జీవితం అందరికీ తెలిసినదే అయినా వ్యక్తిగత జీవితం మాత్రం పెద్దగా తెలియదు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారిలో శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవగా మరో కుమార్తె హీరోయిన్ గా చేయడానికి చూస్తోంది.
పెళ్లికాక ముందు ఈమె జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలను ఇప్పుడు ప్రేక్షకులకు వెల్లడించింది. జీవిత 1993వ సంవత్సరంలో చదువుకుంటున్న రోజుల్లో రోజు బస్సులో కాలేజీకి వెళ్లి వచ్చేదట. ఆరోజులలో ఒకసారి బస్సు పాసు అయిపోవడంతో మళ్లీ తీయాలని ఏవో పనులతో మర్చిపోయింది. అయితే ఆ రోజు టికెట్ తీసుకోవాలి కానీ ఆమె పాస్ ఉందని చెప్పడంతో చెక్ చేయడానికి టైం లేకుండా పోవడంతో కండక్టర్ మిగిలిన టికెట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు.
కొంత దూరం వెళ్లాక ఆ కండక్టర్ తిరిగి మళ్లీ ఆమె దగ్గరికి వచ్చి పాస్ ను చూపించు అని అడిగితే ఆమె ఇవ్వగా ఆ పాస్ ను చూసిన కండక్టర్ ఎక్స్ పైర్ అయిపోయింది కదా అని అన్నాడట. నేను ఇంకా రెన్యువల్ చేయించుకోలేదు అని చెప్పగా, బస్సులో చాలా మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా నవ్వేశారు. కండక్టర్ టికెట్ తీసుకొమని తొందర చేశాడని అప్పుడు ఆమె చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని వెల్లడించింది. టికెట్ కోసం ఇంట్లో డబ్బులు తీసుకునే అలవాటు లేకపోవడంతో ఆమె ఆరోజు జరిగిన అవమానంతో సిగ్గుతో తలవంచుకుని ఏం చేయాలో అర్థం కాక బస్సులోంచి దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఆమె తండ్రి గారి స్నేహితుడు ఒకరు బస్సు లో జరిగినదంతా చూసి టికెట్ తీసుకొని ఆమెను రక్షించారట. ఆ విధంగా అప్పటినుంచి జీవిత ఎక్కడికి వెళ్ళినా కూడా చేతిలో డబ్బులు పెట్టుకునే అలవాటు చేసుకుందట.