కంచె సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పొడుగాటి బామ‌ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాలో లో మెగా హీరో వరుణ్ తేజ్ కు ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమానే మెగా హీరో పక్కన నటించినప్పటికీ ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఆ తర్వాత పెద్దగా స్టార్ డం అందుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసపెట్టి గుంటూరోడు, నక్షత్రం, ఓం వెంకటేశాయ లాంటి చిత్రాలలో నటించింది. కానీ ఆ తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్లుగా ప్ర‌గ్యా జైస్వాల్ ఒక్క‌ సినిమాలో కూడా  న‌టించ‌క‌పోవ‌డం ఆశ్చర్యకరం.
 

ఇదిలా ఉండగా తాజాగా మాత్రం ప్రగ్యా జైస్వాల్ బంపర్ ఆఫర్ అందుకొంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న... బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
 

ఈ నేపథ్యంలోనే సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటోలతో యూత్ ను తనవైపు తిప్పుకుంది. ఇక ఈ సినిమా విజయం సాధిస్తే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని గట్టి నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో ప్ర‌గ్యా రెచ్చిపోయింది.  ఈ ఫోటో షూట్ లో ప్యాంటు బటన్ తీసేసి మరి రెచ్చిపోయింది. అటు నడుము అందాలు.. ఇటు  మత్తెక్కించే కళ్ళతో ఉన్న ప్రగ్యా పిక్స్ కు ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతలా అందాలు ఆరబోస్తున్న ప్రగ్యా జైస్వాల్  కెరీర్ బాలయ్య సినిమాతో అయినా పైకి లేస్తుందా అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: