
ఇటీవల ఆమె నటించిన 11థ్ అవర్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్ 3, దట్ ఈజ్ మహాలక్ష్మి, మ్యాస్ట్రో, సీటిమార్ సినిమాలతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని మూవీ లో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇప్పటికే ప్రపంచావ్యాప్తంగా అనేక భాషల్లో పేరు దక్కించుకున్న ఫుడ్ రియాలిటీ షో మాస్టర్ చెఫ్, త్వరలో తెలుగు లో కూడా రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ టివి ఛానల్ జెమినీ టెలివిజన్ వారు ఈ నెలాఖరులో ప్రసారం చేయనున్న ఈ షో కి తమన్నా మెంటర్ గా వ్యవహరించనుండగా 15 మంది కంటెస్టెంట్స్, అలానే నలుగురు ఫుడ్ ఎక్స్ పెర్ట్స్ ఈ షో ని హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కార్యకమం తాలూకు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నేడు బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో తమన్నా ట్రెండీ స్టైల్ వెల్వెట్ కలర్ డ్రెస్ లో తళతళలాడుతూ మెరిసిపోయారు. ఆమె మీడియాతో మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా, ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే మెంటర్ లా కాదు మా ఫ్యాన్స్ అందరికీ మెంటలెక్కించేలా ఉన్నారు అంటూ కొందరు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తమన్నా లుక్స్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ....!!