ప్రస్తుతం మన టాలీవుడ్ అగ్ర హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు.ఎందుకంటే ఒక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనుక సక్సెస్ సాధిస్తే ఇతర ఇండ్రస్టీల్లో కూడా భారీ మార్కెట్ తో పాటూ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది.మన హీరోలతో పాటూ దర్శకనిర్మాతలు సైతం పాన్ ఇండియా సినిమాలు నిర్మించడానికి, తెరకెక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇక ఇదిలా ఉంటె మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో భారీ సక్సెస్ సాధించిన విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా సీక్వెల్ ని సంపత్ నందిడైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా బడ్జెట్  సుమారు 100 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండబోతోందని ఇండ్రస్టీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే రవితేజ తో 100 కోట్ల బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ సీక్వెల్ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రైటర్ కావడంతో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఇంత మొత్తంలో పెట్టి సినిమా నిర్మించడానికి ఓ నిర్మాత ఈ సీక్వెల్ పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఆ నిర్మాత ఇంత పెద్ద బడ్జెట్ తో ఈ సీక్వెల్ ని హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు నెలకొనడంతో రచయిత విజయేంద్ర ప్రసాద్ కొంత ఆలోచనలు చేస్తున్నారని సమాచారం.మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ పై హీరో రవితేజ ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నా..

ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం అవుతోంది.ఇక ఇటీవల క్రాక్ సక్సెస్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల విడుదల వాయిదా పడింది.ఇక త్వరలోనే కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: