సుస్మితా సేన్ నైంటీస్‌లో ఎంతోమంది కుర్రాళ్లని ప్రేమలో పడేసింది. మిస్ యూనివర్స్‌గా కలలరాణిలా మారింది. అయితే ఈమెకి ఏజ్ పెరిగినా నలభై అయిదు ఏళ్లు వచ్చినా ఇప్పటికీ కుర్రాళ్లు ఫిదా అవుతూనే ఉన్నారు. అయితే ఈ మాజీ మిస్ యూనివర్స్ మాత్రం ఆమె కంటే 15 ఏళ్లు చిన్నోడైన మోడల్ రోహమాన్ షాల్‌కి ఫిదా అయ్యింది. ఇద్దరూ లివ్-ఇన్-రిలేషన్లో ఉన్నారు.మలైకా అరోరా అయితే ప్రేమ కోసం పెళ్లిని కూడా వదులుకుంది. భర్త అర్భాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చి మరీ, అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. అర్జున్ తనకంటే 12 ఏళ్లు చిన్నోడు అయినా సరే, ఈ గ్యాప్‌తో పట్టింపులేకుండా ప్రేమ యాత్రలు చేస్తోంది. ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్పులు అంటూ తెగ తిరిగేస్తున్నారు. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
హాట్ లుక్స్‌తో బాలీవుడ్‌ని మాయ చేసిన డస్కీ బ్యూటీ బిపాసా బసు. కొంచెం బోల్డ్ అప్పియరెన్స్‌తో వెండితెరకి కూడా వేడి పుట్టించిన ఈ హీరోయిన్ తన కంటే నాలుగేళ్లు చిన్నోడైన కరణ్ సింగ్ గ్రోవర్‌తో ఏడడుగులు వేసింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక చోప్రా కూడా తన కంటే చిన్నవాడినే పెళ్లి చేసుకుంది. ప్రియాంక భర్త అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనస్ ఈమె కంటే పదేళ్లు చిన్నోడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి