రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు యావత్ సినిమా ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్, విక్రమాదిత్య అనే ఆస్ట్రాలజర్ పాత్ర చేస్తుండగా ఆయనకి జోడీగా ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్, హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

వాస్తవానికి సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా హఠాత్తుగా కరోనా కారణంగా ఆగిపోయింది. దానితో ఎంతో నిరుత్సాహానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్, ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అప్పటి నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దీనితో పాటు రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఏదో ఒక తేదీన రిలీజ్ చేస్తాం అంటూ ఇటీవల ఆ మూవీ యూనిట్ ప్రకటించడంతో రాధేశ్యామ్ టీమ్ ఆర్ఆర్ఆర్ తో క్లాష్ కాకుండా ఒక మంచి రిలీజ్ డేట్ కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే అసలు విషయం ఏమిటంటే, నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న కథనాల్ని బట్టి రాధేశ్యామ్ మూవీ థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు భారీ డీల్ సిద్ధం అయిందని, ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ఎంతో భారీ మొత్తం ఇచ్చి ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులు సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి.

దానితో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఒక్కసారిగా పెద్ద షాక్ కి గురయ్యారు. కాగా అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని, తప్పకుండా తమ సినిమా పక్కాగా త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని ఈ సినిమాకి బీజీఎమ్ అందిస్తున్న సంగీత దర్శకుడు థమన్, దర్శకుడు రాధాకృష్ణ నిన్న తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. అందుతున్న వార్తలను బట్టి మార్చి మొదటి వారంలో రాధేశ్యామ్ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: