గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమ పై ఏపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే తమ అసహనాన్ని ఏవిధంగా చూపించాలో అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. ఆ విధంగా ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా ఏపీలో మాత్రం మంచి కలెక్షన్లను సాధించలేకపోతున్నారు. అలా నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. వంద రూపాయలు వచ్చే చోట పది రూపాయలు రావడం అనేది ఎవరికైనా ఇబ్బందే.

 సినిమా పరిశ్రమపై కనికరం లేకుండా ప్రభుత్వం ఇలా చేస్తూ ఉండడం నిజంగా ఎందుకు ప్రభుత్వం ఇలా కక్ష్య సాధింపు చర్యలకు చేస్తుంది అన్నట్లు అలోచిస్తున్నారు. పరిశ్రమ నుంచి కొంత మంది సపోర్టు ఉండడం వల్లనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏపీలో రాజ్యమేలుతుంది. అలా వారికి ఉపయోగపదకుండా అన్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీని పట్ల వారు కూడా ఏమాత్రం ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారు. 

తాజాగా దేశంలోనే అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో అన్న ఈ విషయంపై కాకుండా ఏపీలో ఇలాంటి చట్టం అమలు అవుతుందో అన్న విషయంపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇంతటి భారీ బడ్జెట్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నందుకు ఆనందపడాలో కలెక్షన్ల పరంగా ఏపీలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బాధపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం ఈ సినిమాకైనా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. 

\ఇక ప్రేక్షకులలో ఎన్నో అంచనాలున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా ఎన్టిఆర్ కొమురం భీమ్ గా నటించాడు.వీరిద్దరూ కలిసి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు అనేదే ఈ సినిమా కథ. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: